Home / Tag Archives: Marriage

Tag Archives: Marriage

పెళ్ళి ఇంట విషాదం

తెలంగాణలో నిర్మల్ జిల్లాలోని కడెం మండలంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. మండ‌లంలోని పాండవ‌పూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నవ వధువు మౌనిక (25), ఆమె తండ్రి రాజయ్య (50) మృతి చెందారు. పెండ్లి కొడుకుతో పాటు కారు డ్రైవ‌ర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క‌డెం మండ‌లం పాత మ‌ద్దిప‌డ‌గకు చెందిన రాజ‌య్య‌.. ఈ నెల 25న మ‌హారాష్ట్ర‌కు చెందిన ఓ యువ‌కుడితో త‌న కూతురి వివాహం …

Read More »

ఆషాఢ మాసంలో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?

ఆషాఢ మాసంలో సప్త ధాతువులు సరిగ్గా పనిచేయవు, వర్షాలు కురవడంతో పొలం పనులు కూడా అధికంగా ఉంటాయి. అలాగే ఆషాఢంలో గర్భధారణకు అనువైన మాసం కాదని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు చేయరు. అలాగే, ఆషాఢంలో పూజలు, వ్రతాలు వంటివి ఎక్కువగా ఉంటాయి. పూజలతో పూజారులంతా బిజీగా ఉంటారు. దీంతో పెళ్లి తంతు నిర్వహించడానికి సమయం ఉండదు. ఈ కారణాలతో ఆషాఢంలో పెళ్లిళ్లు జరగవు.

Read More »

పెళ్ళిపై ఛార్మీ క్లారిటీ

తాను పెళ్ళికి సిద్ధమయ్యాయని వచ్చిన వార్తలను హీరోయిన్, నిర్మాత ఛార్మి ఖండించింది. “ఇప్పుడు నా జీవితంలో మంచి దశలో ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో పెళ్లి చేసుకునే తప్పును నేను ఎప్పటికీ చేయను” అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్తో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని స్పష్టం చేసింది. ఛార్మి ప్రస్తుతం పూరి కనెక్ట్ సహనిర్మాతగా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకుంటోంది.

Read More »

అనుష్కకు పెళ్ళా..ఎవరితో…?

తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత మోస్ట్ బ్యాచిలర్ హీరోయిన్లలో ఒకరైన అనుష్క శెట్టి.. త్వరలో పెళ్లి పీటలెక్కనుందట. కొంతకాలంగా మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న స్వీటీ కుటుంబసభ్యులకు.. ఓ అబ్బాయి దొరికినట్లు సమాచారం. అతడు దుబాయికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొడుకని, అతడు అనుష్క కంటే వయసులో చిన్నవాడని తెలిసింది. కరోనా తగ్గితే ఇరుకుటుంబాలు చర్చించుకొని పెళ్లికి ముహుర్తం పెట్టుకోవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

Read More »

అవికా గోర్ కి పెళ్ళయిందా..?

ప్రముఖ నటి అవికా గోర్, హిందీ నటుడు ఆదిల్ ఖాన్ కు  పెళ్లయిందని ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది ఇద్దరూ పెళ్లి దుస్తులు వేసుకొని చర్చిలో ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో కొందరు నెటిజన్లు విషెస్ కూడా చెప్పేశారు. అయితే ఇదంతా ఓ సాంగ్ చిత్రీకరణలో భాగమని తెలిసింది. ‘కాదిల్’ అనే పాట షూటింగ్ లో వీరిద్దరూ ఇలా స్టిల్స్ ఇచ్చారట. కాగా నటి అవికా గోర్.. …

Read More »

పెళ్లికి రెడీ అయిన సంజనా

వెండితెర‌పై అల‌రిస్తున్న అందాల భామ‌లు ఒక్కొక్క‌ళ్లుగా పెళ్ళి పీట‌లెక్కుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో కాజ‌ల్ అగ‌ర్వాల్, నిహారిక పెళ్లి చేసుకోగా, మెహ‌రీన్ మ‌రి కొద్ది రోజుల‌లో భ‌వ్య అనే వ్య‌క్తిని పెళ్లాడ‌నుంది. ఇక ఇప్పుడు క‌న్న‌డ బ్యూటీ సంజ‌నా గ‌ల్రానీ కూడా పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. డాక్ట‌ర్ పాషా అనే వ్య‌క్తితో సంజ‌నా ఇప్ప‌టికే నిశ్చితార్ధం జ‌రుపుకుంద‌ని తెలుస్తుండ‌గా, వీరి వివాహం స‌మ్మ‌ర్‌లో ఉంటుంద‌ని శాండ‌ల్‌వుడ్ స‌మాచారం. ఏడాది …

Read More »

భర్తకు బట్టతల ఉందని భార్య..?

భార్య దగ్గర బట్టతల విషయం దాచినందుకు ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. UPలోని ఘజియాబాద్ కు చెందిన ఓ జంటకు గతేడాది జనవరిలో పెళ్లయింది. ఆ వేడుక కోసం విగ్ పెట్టిన పెళ్లికొడుకు ఏడాది పాటు దాన్ని బాగానే కవర్ చేశాడు. అయితే ఇటీవలే నిజం బయటపడింది దీంతో తన భర్త మోసం చేశాడని భావించిన ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. వారు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. …

Read More »

14ఏళ్ల బాలికను వివాహాం చేసుకున్న 50 ఏళ్ల ఎంపీ

14ఏళ్ల బాలికను యాభై ఏళ్ల ఎంపీ వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ కు చెందిన జమియత్ ఉడేమా ఎ ఇస్లాం నేత సలాహుద్దీన్ అయాబీ అనే ఎంపీ.. తాజాగా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అది దేశవ్యాప్తంగా సంచలనమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు MPపై కేసు నమోదు చేశారు. కాగా పాక్ చట్టాల ప్రకారం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారిని …

Read More »

అనిరుధ్‌-కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ

మ‌హాన‌టి ఫేం కీర్తి సురేష్‌..త‌మిళ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను వివాహం చేసుకోనుంద‌ని కొద్ది రోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. వీరిద్ద‌రు క‌లిసి అన్యోన్యంగా దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ.. అతి త్వ‌ర‌లోనే కీర్తి , అనిరుధ్ వివాహం ఉంటుంద‌ని పుకార్లు పుట్టించారు. దీనిపై ఇటు అనిరుధ్ కాని, అటు కీర్తి కాని రియాక్ట్ కాలేదు. కీర్తి- అనిరుధ్ వివాహం అంటూ కొన్నాళ్లుగా వ‌స్తున్న వార్త‌ల‌ను వారి క్లోజ్ ఫ్రెండ్స్ ఖండించారు. చాన్నాళ్లుగా …

Read More »

కీర్తి సురేష్ కి ఆ యువ సంగీత దర్శకుడుతో పెళ్లి..? నిజమా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ హీరోయిన్ కీర్తి సురేష్ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ను త్వరలో వివాహం చేసుకోనుందని కోలీవుడ్ టాక్, ఈ ఏడాది చివర్లో వీరి పెళ్లి జరగనుందని కోలీవుడ్ కోడై కూస్తోంది. అయితే దీనిపై ఇరువర్గాలు ఇంకా స్పందించలేదు. కీర్తి ప్రస్తుతం ‘సర్కారు వారిపాట, రంగ్ దే, అన్నాత్త, గుక్ సఖి వంటి సినిమాల్లో నటిస్తోంది. అటు అనిరుధ్ కూడా పలు చిత్రాలకు …

Read More »