లవర్‌తో ఓ జవాన్ భార్యకున్న అక్రమ సంబంధం బట్టబయలైంది. ప్రియుడితో ఆమె ఏకాంతంగా ఉన్న సమయంలో అనుకోకుండా భర్త రావడంతో దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. రహ్మత్‌నగర్ పరిధిలో జవాన్ భార్య అద్దె ఇంట్లో ఉంటోంది. ఉద్యోగ రీత్యా భర్త వేరే ప్రాంతంలో ఉంటుండగంతో ఇద్దరు పిల్లలతో ఆమె అద్దె ఇంట్లో నివసిస్తోంది.
ఈ నేపథ్యంలో లవర్‌తో అదే ఇంట్లో ఏకాంతంగా ఉన్న సమయంలోనే భర్త ఇంటికి వచ్చాడు. ఇద్దర్నీ ఏకాంతంగా చూసి ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. వెంటనే వారిని లోపలే ఉంచేసి ఇంటికి తాళం వేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. భార్య, ఆమె ప్రియుడిపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.