Tollywood తెలుగు ప్రేక్షకుల నోట వినిపిస్తున్న తాజా పేరు ‘విరాటపర్వం’. రానా దగ్గుబాటి, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష ఆధరణ వస్తుంది. రానా, సాయిపల్లవి నటనకు సినీప్రముఖులు సైతం మంత్ర ముగ్ధులయ్యారు.
నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. కాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ధరకు విక్రయించినట్లు సమాచారం.తాజాగా టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం విరాటపర్వం చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ రూ.15 కోట్లకు విక్రయించినట్లు టాక్.
ఈ చిత్రం విడుదలైన 50రోజుల తర్వాతే డిజిటల్లో విడుదల చేయాలని మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారట. ప్రేమ, విప్లవం వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా రవన్న పాత్రలో నటించగా.. సాయిపల్లవి వెన్నెల పాత్రలో నటించింది. ప్రియమణి, నవీన్ చంద్ర, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థతో కలిసి సురేష్‌బాబు స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు.