తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో ఐసోలేషన్‌లో ఉన్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడక ఈ రోజు చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని హాస్పిటల్ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది.
అలసట, జ్వరంగా అనిపించడంతో కరోనా టెస్ట్‌లు చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చిందని సీఎం ట్విట్టర్ ద్వారా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని, వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రజలను అభ్యర్థించారు. సీఎం స్టాలిన్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, మాజీ సీఎం పన్నీరు సెల్వం, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి కోరుకున్నారు.