టీమిండియా మాజీ కెప్టెన్ ..లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీకి దేశ అత్యున్నత న్యాయ స్థానం నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఆమ్రపాలి గ్రూప్ కేసులో సుప్రీంకోర్టు నోటీసులు పంపింది.
ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్య వర్తిత్వాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. గతంలో ఆమ్రపాలి కన్స్ట్రక్షన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ధోని.. తనకు రావాల్సిన రూ.40కోట్ల పారితోషికాన్ని కంపెనీ ఎగ్గొట్టిందని సుప్రీంను ఆశ్రయించాడు. మరోవైపు కంపెనీ మాత్రం ధోని తమకు రూ.42 కోట్లు చెల్లించాలని వాదిస్తోంది.