నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా రూపొందించిన మూవీ బింబిసార. హైదరాబాద్‌లో శుక్రవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు నందమూరి అభిమానులు భారీగా హాజరయ్యారు. అనంతరం ఓ అభిమాని అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మృతిచెందిన అభిమానిని తాడేపల్లి గూడెంకు చెందిన పుట్టా సాయిరామ్‌గా గుర్తించారు. కూకట్‌పల్లిలో ఉంటూ ఓ ప్రైవేట్ జాబ్ చేస్తున్న సాయిరామ్.. బింబిసార ప్రీరిలీజ్ ఫంక్షన్ నుంచి వచ్చే క్రమంలో మృతిచెందాడు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం అతడి మృతదేహం ఉస్మానియా హాస్పిటల్‌లో ఉంది.