Home / Tag Archives: died

Tag Archives: died

ఉత్తేజ్ ఇంట విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట విషాదం నెలకొంది. ఉత్తేజ్ భార్య పద్మావతి అనారోగ్యంతో కన్నుమూశారు. బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఉత్తేజ్ కి చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె కీలకంగా వ్యవహరించేవారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉత్తేజ్- పద్మావతి దంపతులకు చేతన, పాట అనే ఇద్దరు పిల్లలున్నారు.

Read More »

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కన్నుమూత

ఏపీ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ చెన్నై అపోలో ఆస్పత్రిలో మృతి చెందగా.. ఆయన మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం తెలియజేశారు. ‘రామచంద్రారెడ్డి సిద్ధాంతాలకు కట్టుబడిన నేత. ఆయనతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులకు నా సానుభూతి’ అని వెంకయ్యనాయుడు అన్నారు. అటు సోమువీర్రాజు కూడా సంతాపం తెలియజేశారు.

Read More »

మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో మరో విషాదం

ఏపీకి చెందిన మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండో కుమారుడు రవీంద్ర నాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్-బంజారాహిల్స్ రోడ్ నం.2లోని హయత్ ప్లాజాలో చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. రవీంద్రనాథ్ను అపోలోకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి కారణాలు తెలియలేదు. కాగా ఇటీవలే మాగంటి పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మృతి చెందారు.

Read More »

రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూత

భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు RBI ప్రతినిధి ఒకరు తెలిపారు. 1977 మే నుంచి నవంబర్ మధ్య నరసింహం RBI గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్, IMFలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు.

Read More »

మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు కన్నుమూత

ఏపీలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత కాకర్లపూడి సుబ్బరాజు (66) ఇక లేరు. విజయవాడలోని తన నివాసంలో అర్ధరాత్రి గుండెపోటుతో ‘కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు చేస్తామని చెప్పారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, సీపీఐ, అనుబంధ సంఘాల్లో సుబ్బరాజు పనిచేశారు. 1994-99 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు.

Read More »

సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మృతి

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా మృతి చెందారు. ఈ ఉదయం 4.30 గంటలకు ఢిల్లీలో కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. 1974 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన రంజిత్ సిన్హా గతంలో ITBP, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగానూ పనిచేశారు. ఈయన స్వస్థలం బిహార్ రాజధాని పాట్నా.

Read More »

వేదం మూవీ నటుడు నాగ‌య్య మృతి.

వేదం సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ నాగ‌య్య శ‌నివారం క‌న్నుమూశారు. 30కి పైగా సినిమాల‌లో న‌టించిన నాగ‌య్య అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. గుంటూరు జిల్లా, న‌ర్స‌రావు పేట స‌మీపంలోని దేస‌వ‌రం పేట గ్రామానికి చెందిన నాగ‌య్యకు ఊర్లో రెండెక‌రాల భూమి ఉండేది. అక్క‌డ ప‌ని లేక‌పోవ‌డంతో కొడుకుతో క‌లిసి హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. ఇచ్చిన డైలాగ్‌ని కంఠ‌స్తం ప‌ట్టి గ‌డ‌గ‌డ చెప్ప‌డంతో అత‌ని ప్ర‌తిభ‌ని గుర్తించి వేదం …

Read More »

మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో విషాదం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ నేత, ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు  టీడీపీకి చెందిన యువనేత మాగంటి రాంజీ(37) కన్నుమూశాడు. రాంజీ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చేర్పించారు. తాజాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాంజీ మృతికి నారా లోకేష్ తో పాటు పలువురు టీడీపీ  నేతలు సంతాపం తెలిపారు

Read More »

పూజా హెగ్డే ఇంట్లో విషాదం

టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట్లో విషాదం నెల‌కొంది. తాను ఎంత‌గానో ప్రేమించే బామ్మ ఈ రోజు వారి మ‌ధ్య లేద‌ని దుఃఖ సాగ‌రంలో మునిగింది. బామ్మ చనిపోయింద‌నే విష‌యాన్ని పూజా హెగ్డే త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేస్తూ.. ఈ క్యూటీని మేం కోల్పోయాము. ఎక్క‌డ ఉన్నా కూడా సంతోషంగా, హాయిగా,  ఎలాంటి బాధ‌లు లేకుండా ఉంటుంద‌ని ఆశిస్తున్నాను. క‌ష్టాలలో ఉన్నా న‌వ్వుతూనే ఉండాల‌ని ఆమె మాకు నేర్పించింది. …

Read More »

కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్ (86) కన్నుమూశారు. పంజాబకు చెందిన బూటా సింగ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా పేరొందిన బూటా సింగ్ 8 సార్లు లోక్ సభ ఎంపీగా గెలిచారు. కేంద్రంలో హోం వ్యవసాయ, రైల్వే, క్రీడలు లాంటి ముఖ్యమైన శాఖలకు మంత్రిగా.. బిహార్ గవర్నర్ గా, జాతీయ SC …

Read More »