ఎన్నో సినిమాలు చేసి సూపర్హిట్లు కొడితేగాని దక్కని క్రేజ్ అర్జున్‌రెడ్డి మూవీతో సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అందులోనూ ఓ సినిమా రిలీజ్‌కు ముందు టాలీవుడ్ హీరో బాలీవుడ్లో క్రేజ్ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. అలాంటిది మన లైగర్ హీరోకు ముంబయిలోని ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..
విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న సినిమా లైగర్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఆదివారం విజయ్ హీరోయిన్ అనన్యతో కలిసి ముంబయిలోని ఓ షాపింగ్‌మాల్‌కు వెళ్లారు. అర్జున్‌రెడ్డి వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు భారీగా షాపింగ్‌మాల్‌కు చేరుకున్నారు. అధిక సంఖ్యలో ఫ్యాన్స్ రావడంతో ఓ టాలీవుడ్ హీరోకు బాలీవుడ్లో ఇంత క్రేజ్ ఏంటని షాక్ అవుతున్నారు. ఇదేం క్రేజ్‌రా బాబోయ్ అంటూ పోస్టులు పెడుతున్నారు.