నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకున్నప్పటి నుంచి రకరకాల రూమర్స్‌ను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎప్పుడూ వీటిపై స్పందించని చైతూ తాజాగా పెదవి విప్పాడు. సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
చైతూ తన కొత్త సినిమా లాలా సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్ మీడియాతో మాట్లాడాడు. తన వ్యక్తిగత జీవితంలో ప్రచారమవుతున్న వార్తలపై స్పందించాడు. తనపై వస్తున్న రూమర్స్ చూస్తుంటే నవ్వొస్తుందని, వాటిని తాను పట్టించుకోవడం లేదని తేల్చి చెప్పేశాడు. దీంతో చై ఓ బాలీవుడ్ నటితో ప్రేమలో ఉన్నాడని, త్వరలో పెళ్లి చేసుకోనున్నారని వస్తున్న వార్తలకు పుల్‌స్టాప్ పడినట్లయింది.
మేమిద్దరం కలిస్తే క్రేజీనే…
సమంతతో కలిసి మళ్లీ నటిస్తారా అని ఓ విలేకర్ ప్రశ్నించగా నేను సామ్ కలిసి నటిస్తామో లేదో నాకు కూడా తెలీదని, అది కేవలం విధికే తెలుసుని చైతూ జవాబిచ్చారు. అంతేకాకుండా సమంత, నేను మళ్లీ కలిసి నటిస్తే అది చాలా క్రేజీ అవుతుందని చెప్పారు.