Home / NATIONAL / ట్రైన్‌లో దారుణం.. వాటర్‌ కోసం ఓ వ్యక్తిపై పాంట్రీ సిబ్బంది దాడి

ట్రైన్‌లో దారుణం.. వాటర్‌ కోసం ఓ వ్యక్తిపై పాంట్రీ సిబ్బంది దాడి

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పుర్ ప్రాంతంలో కదులుతున్న రైలు నుంచి ఓ వ్యక్తిని పాంట్రీ సిబ్బంది కిందకి తోసేశారు. రవి యాదవ్ అనే ఓ వ్యక్తి తన సోదరితో కలిసి రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

వాటర్ బాటిల్, గుట్కా విషయంల రవి, పాంట్రీ సిబ్బంది మధ్య గొడవ జరిగింది. దీంతో లలిత్‌పుర్ స్టేషన్‌లో రవి సోదరి దిగిపోగా, రవిని పాంట్రీ సిబ్బంది అడ్డుకొని దిగనివ్వలేదు. ఆయనపై దాడి చేసి కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశారు. తీవ్ర గాయాలపాలైన రవి గుర్తించిన కొందరు హాస్పటల్‌కి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri