సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం ప్రగతిభవన్‌లో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
స్వాతంత్ర దినోత్సవం కానుకగా 15 నుంచి రాష్ర్టంలో కొత్తగా మరో 10 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ర్ట మంత్రిమండలి. వీటితో పాటు రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్‌వాడీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది కేబినెట్.
58,59 జీవోల కింద పేదలకు పట్టాలు పంపిణీని వేగవంతం చేయాలని నిర్ణయించింది. కోఠిలోని ఈఎన్‌టీ హాస్పిటల్‌లో ఈఎన్‌టీ టవర్, సరోజినీదేవి ఐ హాస్పిటల్ కొత్త బిల్డింగ్స్, కోఠిలోని వైద్యారోగ్య శాఖ సముదాయంలో ఆసుపత్రి నిర్మాణ ప్రతిపాదనలకు అనుమతించింది కేబినేట్.