నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన బింబిసార సక్సెస్‌పై బాలకృష్ణ స్పందించారు. సినిమా అద్భుతంగా ఉందని ఇలాంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించినందుకు హ్యాట్సాఫ్ అంటూ కొనియాడారు. మొదటి సినిమా అయినప్పటికీ డైరెక్టర్ వశిష్ఠ్‌కి తనని తాను ఫ్రూవ్ చేసుకున్నావని త్వరలో మనం కలిసి పనిచేద్దాం అని అన్నారు బాలయ్య. కొత్త వారికి గొప్ప అవకాశాలిచ్చిన ఘనత తమ కుటుంబానికే దక్కుతుందని చెప్పారు.
ఇలాంటి మరిన్ని సినిమాలను నువ్వు అందించాలని అదే నేను బాబాయ్‌గా కోరుకుంటున్నానని కల్యాణ్‌రామ్‌ను ఉద్దేశించి అన్నారు. బింబిసార ప్రయోగాత్మక సినిమానే కాదు.. ఈ కథలో ఎన్నో నిజాలు ఉన్నాయని.. భావితరాలకు ఈ సినిమా ద్వారా మంచి సందేశం ఉంది అని తెలిపారు బాలకృష్ణ. బింబిసారను అందరూ చూడండి. ఈ మూవీని సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు అని చెప్పారు నందమూరి నటసింహం.