మీరు యాపిల్ ఉత్పత్తులైన ఐపాడ్, మొబైల్ ఫోన్స్ వాడుతున్నారా..? .. లేదా మీరు వాటిని కొనాలని చూస్తున్నారా..?. అయితే మీకో షాకింగ్ లాంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులంటేనే భద్రతకు మారుపేరు. హ్యాకింగ్ కు వీలులేనంతగా వీటిని తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంది ఈ సంస్థ. అయితే ఈ పరికరాలకు భద్రత పరమైన ముప్పు ఏర్పడిందని యాపిల్ సంస్థ ప్రకటించింది. సాఫ్ట్ వేర్ లో తీవ్ర భద్రతాపరమైన లోపాన్ని గుర్తించినట్లు ఐఫోన్లు,ఐఫ్యాడులు,మ్యాక్ బుక్ లు హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని నిన్న శుక్రవారం యాపిల్ సంస్థ ప్రకటించింది.ఓఎస్ లో లోపం ఆధారంగా హ్యాకర్లు ఈ డివైజ్ లను పూర్తిగా నియంత్రణలోని తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనికి సంబంధించిన రెండు భద్రతాపరమైన నివేదికలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఐ ఫోన్ 6 ఆపై మోడళ్లు ,ఐప్యాడ్ ఎయిర్ 2 మోడల్స్ ,మ్యాక్ ఓఎస్ పై నడిచే మ్యాక్ బుక్ లు కొన్ని హ్యాకింగ్ ముప్పు పొంచి ఉన్నది. తక్షణమే సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేసుకోవాలని ఆ సంస్థ తెలిపింది.
