కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాలలో గురువారం దారణం చోటుచేసుకుంది. ఆరు నెలల నిండు గర్భిణిని గొడ్డలితో నరికిన భర్త తర్వాత అతడు అదే గొడ్డలితో నుదురుపై నరుక్కున్నాడు. భార్య అక్కడికక్కడే మృతి చెందగా భర్త చికిత్స పొందుతూ చనిపోయాడు.
చిట్యాల గ్రామానికి చెందిన సరుగు సత్తవ్వ- నారాయణలకు పిల్లలు లేకపోవడంతో సంజీవులను చిన్నతనంలో దత్తత తీసుకున్నారు. ఆరేళ్ల క్రితం గాంధారి మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన రమ్మశ్రీతో పెళ్లి చేశారు. కొన్ని రోజులు బాగానే ఉన్నా తర్వాత తాగుడుకు బానిస అయ్యాడు. పని కూడా చేయకపోవడంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ తరుణంలో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఇటీవల పంచాయతీ జరగడంతో పెద్దల ఇరువురిని ఒప్పించి ఒకటి చేశారు. వీరికి మూడేళ్ల కూతురు సహశ్రీక ఉంది. గురువారం మళ్లీ సంజీవులు ఫుల్లుగా తాగి మద్యం మత్తులో భార్య నిండు గర్భిణి అని చూడకుండా గొడ్డలితో నరికేశాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తర్వాత అతడు కూడా గొడ్డలితో నుదిటిపై నరుక్కున్నాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు.