Home / NATIONAL / విమానంలో గుక్కపట్టిన పాపాయి.. గుండెలకు హత్తుకున్న సిబ్బంది

విమానంలో గుక్కపట్టిన పాపాయి.. గుండెలకు హత్తుకున్న సిబ్బంది

పసిపిల్లల బోసి నవ్వులు చూస్తే ఆ ఆనందమే మాటల్లో చెప్పలేం. అదే ఏడిస్తే ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. అదే ప్రయాణంలో వారు గుక్కపట్టి ఏడిస్తే.. ఏమైందా అని ఓ టెన్షన్ అయితే.. చుట్టు పక్కల వారు ఏమనుకుంటారా అని మరో టెన్షన్. తాజాగా ఇలాంటి ఓ సంఘటన విమానంలో చోటు చేసుకుంది. ఓ పసిబిడ్డ గుక్క పట్టి ఏడ్వడంతో ఆ సిబ్బంది చేసిన పనికి అందరూ ఫిదా అయ్యారు. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసా..

ఎయిర్ ఇండియా విమానంలో ఓ ఫ్యామిలీ పసిబిడ్డతో ట్రావెల్ చేస్తున్నారు. ఇంతలో ఏం అయిందో ఏమో బుజ్జి పాపాయి ఒక్కసారిగా గుక్కపట్టి ఏడ్చింది. పేరెంట్స్ ఎంత కంట్రోల్ చేసిన పాప ఏడుపు ఆపలేదు. అక్కడే ఉన్న నీల్ మాల్కం అనే ఎయిర్ ఇండియా సిబ్బంది ఆ బుజ్జాయిని తన భుజంపై ఎత్తుకొని అటూఇటూ తిప్పుతూ ఓదార్చాడు. అతని ఆత్మీయ ప్రవర్తనను మెచ్చుకున్న చిన్నారి తండ్రి దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. నా కూతురు అతని దగ్గర హాయిగా నిద్రపోవడం చూసి ఆశ్చర్యంగా ఉందని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.  

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat