Home / NATIONAL / విమానంలో యువకుడి వింత ప్రవర్తన.. సీటుకు కట్టేసిన సిబ్బంది!

విమానంలో యువకుడి వింత ప్రవర్తన.. సీటుకు కట్టేసిన సిబ్బంది!

షెషావర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. సిబ్బందితో గొడవ పడుతూ.. ప్లైట్ కిటికీ అద్దాలను కాలితో తన్ని బద్దలుకొట్టేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విమానం టేకాఫ్ అయిన తర్వాత ఆ యువకుడు తన షర్ట్ విప్పేసి సిబ్బందితో గొడవ పెట్టుకున్నాడు. అనంతరం కింద బోర్టా పడుకొని వింత వింతగా ప్రవర్తించాడు. ప్రయాణికులు సైతం ఆ యువకుడి చేట్టలకు బొత్తరపోయారు. ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో సిబ్బంది తోటి పాసింజర్స్‌కు ఇబ్బంది కలిగించినందుకు ఆ యువకుడ్ని విమానయాన చట్టం ప్రకారం సీటుకు కట్టేశారు. తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చి విమానాశ్రయంలో భద్రత ఏర్పాటు చేయించారు. ప్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిస్ బిహేవ్ చేసినందుకు ఆ యువకుడిని పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat