Home / MOVIES / ఫ్యాన్స్ గెట్‌రెడీ.. నాని ‘దసరా’ ధూమ్ ధామ్ దోస్తానా వచ్చేస్తోంది!

ఫ్యాన్స్ గెట్‌రెడీ.. నాని ‘దసరా’ ధూమ్ ధామ్ దోస్తానా వచ్చేస్తోంది!

 శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం దసరా. ఇందుకు సంబంధించిన క్రేజీ అప్డేట్‌ను పంచుకున్నారు హీరో నాని. ఈ మూవీలో “ధూమ్ ధామ్ దోస్తాన్” అంటూ సాగే ఫస్ట్‌ సాంగ్‌ను విజయదశమి రోజున రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నాని తన సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఇప్పటివరకు రాని మాస్ స్ట్రీట్ సాంగ్‌గా ఇది అలరిస్తుందని తెలిపారు నాని.

ఈ ధూమ్ ధామ్ దోస్తానా సాంగ్‌కు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. ప్రేమ్ రక్షిత్ స్టెప్పులేయించారు. తెలంగాణలోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో నాని సరసన మరోసారి కీర్తి సురేశ్ నటిస్తోంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే సంవత్సరం మార్చి 30న రిలీజ్ కానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat