రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఆస్కార్ బరిలోనూ ఈ ఏడాది దిగనుంది. తాజాగా ఈ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డ్స్‌లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌గా ఎంపికయ్యింది. ఈ గుడ్‌న్యూస్‌ను రాజమౌళి అభిమానులకు తెలియజేస్తూ.. జ్యూరీ టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.
ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో బెస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరిలో మా ఆర్ఆర్ఆర్ సినిమా అవార్డు దక్కించుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా ఆర్ఆర్ఆర్ టీమ్ అందరి తరఫున జ్యూరీ సభ్యులకు చాలా ధన్యవాదాలు. బాహుబలి 2 తర్వాత నాకు వచ్చిన రెండో శాటర్న్ అవార్డు ఇది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నాలని అనుకున్నా. కానీ ఆర్ఆర్ఆర్ జపాన్‌లో రిలీజ్ అవుతున్నందున ఆమెరికా వెళ్లలేకపోతున్నా.