Home / CRIME / తోడు కోరుకున్న వృద్ధుడు.. ప్రేమ పేరుతో లక్షలు నొక్కేసిన అమ్మాయిలు!

తోడు కోరుకున్న వృద్ధుడు.. ప్రేమ పేరుతో లక్షలు నొక్కేసిన అమ్మాయిలు!

 

ఆ వృద్ధుడి భార్య చనిపోయింది. ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకొని వదిలి వెళ్లిపోయారు. షుగర్‌తో బాధ పడుతోన్న వృద్ధుడు తనకు ఓ తోడు కావాలని భావించాడు. ఇందుకు న్యూస్‌పేపర్లలో వచ్చే పెళ్లి యాడ్‌లను చూసి అందులో ఓ మధ్యవర్తికి ఫోన్ చేసి మాట్లాడారు. అటుగా మాట్లాడిన ఓ అమ్మాయి దాన్ని ఆసరాగా తీసుకొని తన ఖాతాతో రూ.3 వేలు వేయమని చెప్పింది. డబ్బులు వేయగానే ఓ ఫోన్ నెంబరు ఇచ్చింది. ఆ నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడగా ఆ అమ్మాయి వృద్ధుడితో సహజీవనం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత అత్యవసరం అని రూ.లక్ష అడగగా.. ఆయన తన దగ్గర డబ్బులు లేవని చెప్పాడు. దీంతో ఆమె ఫోన్ మాట్లాడటం మానేసింది.

రెండు రోజుల తర్వాత మరో అమ్మాయి వృద్ధుడికి ఫోన్ చేసి తనకు చాలా ఆస్తి ఉందని తనకు ఓ తోడు కావాలని వృద్ధుడ్ని నమ్మించింది. కొన్ని రోజులు ప్రేమగా ఫోన్‌లో మాట్లాడి రూ. లక్ష అడిగింది. వెంటనే తిరిగి ఇచ్చేస్తానని నమ్మించింది. దీంతో ఆ వృద్ధుడు ఆమె అకౌంట్‌లో లక్ష వేశారు. డబ్బు వేసిన తర్వాత నుంచి ఆమె వృద్ధుడు ఫోన్ చేస్తే ఆన్సర్ చేయడం మానేసింది.

కొన్ని రోజులకు మరో అమ్మాయి మ్యారేజ్ మధ్యవర్తి నుంచి నెంబరు తీసుకున్నా అని మాటలు కలిపింది. తనకు పెళ్లయిందని భర్తలో మగతనం లేదని, పిల్లలు పుట్టక విడాకులు తీసుకుని ప్రస్తుతం అన్నయ్య దగ్గర ఉన్నానని చెప్పింది. తన దగ్గర కోట్ల ఆస్తి ఉందని దానికోసం అన్నయ్య రోజూ తాగి వచ్చి తనని కొడుతున్నాడని చెప్పి ఫోన్లో ఏడ్చింది. ఆమె మాటలను వృద్ధుడు పూర్తిగా నమ్మేశాడు. తనో ముసలివాడినని, భార్య చనిపోయిందని పిల్లలకు పెళ్లి జరిగి వెళ్లిపోయారని చెప్పాడు. దీంతో ఆమె వృద్ధున్ని పెళ్లి చేసుకునేందుకు రెడీ అని చెప్పింది. పూర్తిగా ఆమె వలలో చిక్కుకున్నాడు ఆ వృద్ధుడు. కొన్ని రోజుల తర్వాత వీడియో కాల్ మాట్లాడాలని చెప్పి ఎలా మాట్లాడాలో తెలియని ఆ వృద్ధుడికి ఓ లింక్ పంపింది. దాన్ని ఉపయోగించడం తెలియని ఆ వృద్ధుడు సైలెంట్ అయిపోయాడు. కొన్ని రోజులకు మళ్లీ ఆమె ఫోన్ చేసి తన అమ్మమ్మ ఆస్తి రిజిస్ట్రేషన్‌ చేయడానికి రూ. లక్ష కావాలని కోరింది. ఆమె మాటలు నమ్మి ఆ వృద్దుడు తన భార్య నగలు బ్యాంక్‌లో కుదవ పెట్టి డబ్బు ఆమెకు ఇచ్చాడు. డబ్బు తీసుకున్న ఆమె అప్పటినుంచి ఆయనతో మాట్లాడటం మానేసింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat