దేశవ్యాప్తంగా ఉన్న కేవీ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు ఈనెల 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4014 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, సెక్షన్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలను డిపార్ట్‌మెంట్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 4014
ఇందులో ప్రిన్సిపాల్ 278, వైస్ ప్రిన్సిపాల్ 116, ఫైనాన్స్ ఆఫీసర్ 7, సెక్షన్ ఆఫీసర్ 22, పీజీటీ 1200, టీజీటీ 2154, హెడ్ మాస్టర్ 237 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణుల్వాలి. సీటెట్‌లో అర్హత సాధించాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 16
వెబ్‌సైట్: https://kvsangathan.nic.in