అత్తింటివారు పెళ్లి కోసం పంపిన లెహంగా నచ్చలేదని ఓ వధువు ఏకంగా పెళ్లికే నిరాకరించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య పెద్ద గొడవే జరిగింది. సమయానికి పోలీసులు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
హల్ద్వానీకి చెందిన ఓ యువతికి, అల్మోరాలో నివాసం ఉంటున్న ఓ యువకుడితో పెద్దలు వవాహం నిశ్చయించారు. నవంబరు 5న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇరు కుటుంబాలు పెళ్లి పనులు ప్రారంభించారు. శుభలేఖలు అచ్చు వేయించారు. కాబోయే కోడలు కోసం మామ లఖ్‌నవూ నుంచి ఓ ఖరీదైన లెహంగా తెప్పించారు. దాన్ని పెళ్లికి ముందే వధువుకి అందించారు. లెహంగా చూసిన వధువు తనకు నచ్చలేదని చెప్పింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య మాటామాటా పెరిగి పెద్ద గొడవే జరిగింది. దీంతో ఇరు కుటుంబాలు పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక గతనెల 30న యువకుడి బంధువులు అమ్మాయి ఇంటికి రూ.1 లక్ష నగదు ఇచ్చి పెళ్లి రద్దు చేసుకున్నారు. ఆ సమయంలో మరోసారి గొడవ జరగగా.. పోలీసుల వరకు విషయం వెళ్లింది. వారు కలుగజేసుకొని సర్దిచెప్పడంతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు.