Home / SLIDER / విండీస్ మాజీ ఆటగాడు డేవిడ్ ముర్రే మృతి

విండీస్ మాజీ ఆటగాడు డేవిడ్ ముర్రే మృతి

వెస్టిండీస్ జట్టుకు చెందిన అంత్యంత సీనియర్  మాజీ క్రికెట‌ర్ డేవిడ్ ముర్రే అనారోగ్యంతో నిన్న  శ‌నివారం మ‌ర‌ణించాడు.1978-82 మ‌ధ్య కాలంలో క్లైవ్ లాయిడ్స్ కెప్టెన్సీలో వెస్టిండీస్ జ‌ట్టు త‌ర‌ఫున ఆడాడు. ఆ స‌మ‌యంలో వెస్టిండీస్ జట్టు క్రికెట్‌లో తిరుగులేని శ‌క్తిగా ఉంది. వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్‌గా జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు.

ఫీల్డ్ లో వికెట్ల వెనుక చురుగ్గా క‌దిలే నైపుణ్యం ముర్రే సొంతం. అందుక‌నే ఇప్ప‌టికీ క‌రీబియ‌న్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఉత్త‌మ కీప‌ర్‌గా ముర్రే పేరు చెప్పుకుంటారు.నాలుగేళ్ల కాలంలో ఆయ‌న 19 టెస్ట్‌లు, 10 వ‌న్డేలు మాత్ర‌మే ఆడాడు. అందుకు కార‌ణం  జాతీయ జ‌ట్టులో పోటీ ఎక్కువ ఉండ‌డంతో రెబెల్స్ టీమ్‌తో క‌లిసి ముర్రే 1980లో ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాడు.

దాంతో, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆయ‌న‌పై జీవిత‌కాల నిషేధం విధించింది. అయితే 72 ఏళ్ల వయ‌సు ఉన్న ముర్రే బార్బ‌డోస్‌లో బ్రిడ్జ్‌టౌన్‌లో ఉన్న‌ త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో ప్రాణాలు విడిచాడు. స్మోకింగ్, డ్ర‌గ్స్ అల‌వాటు కార‌ణంగా ముర్రే ఆరోగ్యం క్షీణించింది అని వైద్యులు తెలిపారు.

 

 

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat