Home / POLITICS / Political : ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం..

Political : ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ తీసుకొచ్చిన జగన్ ప్రభుత్వం..

Political ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎప్పటికప్పుడూ మార్పులు చేస్తూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది జగన్ ప్రభుత్వం.. ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసి
ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ తీసుకురావాలని నిప్ణయించింది.

ఆరోగ్య శ్రీ సేవల కోసం ప్రత్యేక యాప్ తీసుకురావాలని నిర్ణయించిన జగన్ సర్కార్.. ఈ మేరకు జగన్ అధ్యక్షతన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా యాప్ ఉండాలని సూచించారు. అలాగే ఆరోగ్య శ్రీ సేవలపై ప్రజలకు అవగాహన కల్పంచాలన్న సీఎం.. ఈ విషయంలో ఏదైనా తప్పులు జరిగితే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్​ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

అలాగే ఏ వ్యాధికి ఏ ఆసుపత్రిలో చికిత్స లభిస్తుందో వివరాలన్నీ బాధితులకు తెలియాలన్న ఆయన.. ఆసుపత్రి లొకేషన్‌తో పాటు డైరెక్షన్‌ చూపేలా యాప్‌ లో మ్యాప్స్ అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అలాగే “ఆరోగ్య శ్రీ సేవల విషయంలో తప్పులుంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. సేవల్లో నాణ్యత లేకపోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. డయాలసిస్‌ పేషెంట్లకు సేవలందించేందుకు 108 వాహనాలు వినియోగించుకోవాలి. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయాలి. ఇందుకోసం తగిన స్థాయిలో సన్నద్ధం కావాలి. ఉగాది నాటికి విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణాలు పూర్తి చేయాలి. ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రి గురించి గైడ్‌ చేయాలి..” అని తెలిపారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat