నూతన సంవత్సర కానుకగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఈ క్రమంలో ఓ రీమేక్ మూవీతో నూతన సంవత్సరాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
తన సినీ కేరీర్ లోనే హిట్ సినిమాల జాబితాను తీసుకుంటే అందులో తాను రీమేక్ చేసిన సినిమాల సంఖ్యనే ఎక్కువగా ఉంటది. అందుకే పవన్ కళ్యాణ్ మరో రీమేక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వినోదయ సితం అనే తమిళంలో మంచి హిట్ సాధించిన మూవీ ఓ ఫాంటసీ కామెడీ డ్రామా కథతో తెరకెక్కిన ఈ మూవీని తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కల్సి తెలుగు సినీ ప్రేక్షకులకు అందజేయనున్నాడు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి పనులు సెట్స్ పైకి వెళ్ళేందుకు సన్నాహాలు చేసుకుంటుంది ఈ చిత్రం యూనిట్.. దీని మాతృకను నిర్మించిన నటుడు సముద్రఖని తెలుగులోనూ దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. వచ్చే నెల నుండి ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనున్నది. ఇప్పటికే పవన్ హరిహర వీరమల్లు.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలతో పాటు దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.