టీమిండియాకు చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. వికెట్ కీపర్ అయిన రిషభ్ పంత్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆయన ప్రయాణిస్తోన్న కారు రూర్కీ దగ్గర అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్రికెటర్ రిషభ్ పంత్ ను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ ప్రమాదంలో పంత్ కారు నుండి మంటలు ఎగిసి పడ్డాయి. దీంతో పంత్ కారు దగ్ధమైంది. అయితే ఈ సమయంలో కారులో లేకపోవడం తో పంత్ కు పెద్ద ప్రమాదం నుండి బయటపడినట్లు అయింది.