తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ స్టార్..పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు దుబాయ్ ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది. UAE గోల్డెన్ వీసా తాజాగా అందుకున్నాడు.
ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ షేర్ చేశాడు. కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే UAE గోల్డెన్ వీసాను అందుకున్న టాలీవుడ్ తొలి హీరోగా అల్లు అర్జున్ నిలిచాడు. దుబాయ్ దేశం ఫొటోను షేర్ చేస్తూ.. ‘నాకు ఎన్నో అనుభూతులు పంచిన దుబాయికి థాంక్స్. త్వరలోనే మళ్లీ కలుద్దాం’ అంటూ పోస్ట్ చేశాడు.