ఉక్రెయిన్ దేశంపై గత కొన్ని నెలలుగా రష్యా దేశం బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ గురించి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంకా బతికే ఉన్నారో లేదో ఖచ్చితంగా తెలియదని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. వ్లాదిమిర్ పుతిన్ గత కొన్ని వారాలుగా బహిరంగ ప్రదర్శనలకు దూరంగా ఉన్నారని ఆయన చెప్పారు.
దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో జెలెన్స్కీ గురువారం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.శాంతి చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయని అడిగినపుడు జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.