VANDE BHARAT: ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రయాణికులు మురికి కూపంలా చేస్తున్నారంటూ రైల్వే అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరొందిన ‘వందే భారత్ ట్రైన్’ తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 15న సికింద్రాబాద్–విశాఖపట్నం రైలు ప్రారంభించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక సదుపాయాలు..విమానం తరహా సీటింగ్ ఏర్పాటు చేశారు. మిగిలిన రైళ్లతో పోలిస్తే.. దీని నిర్వహణ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అయితే ఈ నెల15 న అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం ఆయిన వందే భారత్ ట్రైన్ ను ప్రయాణీకులు మురికి కూపం లా చేస్తున్నారంటూ రైల్వే అధికారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణీకులు తాగి, తిన్న తర్వాత వ్యర్థాలను….బోగీల్లోనే పడేస్తున్నారని, చెత్తాచెదాలతో నింపేస్తున్నారని వాపోయారు. ఉదయం విశాఖ నుంచి శుభ్రంగా వెళ్లే ట్రైన్ తిరిగి రాత్రికి చేరుకునే సరికి దుర్వాసన వస్తుందని అన్నారు. ఈ విషయంపై ప్రయాణీకులు ఒక్కసారి ఆలోచించాలని రైల్వే ఉన్నతాధికారులు వేడుకుంటున్నారు.
ఈ రైలుకు మొత్తం 16 ఏసీ బోగీలుంటాయి.. 1,128 సీట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆటోమేటిక్ డోర్స్, స్మోక్ అలారం, సీసీ టీవీ కెమెరాలు, బయో వ్యాక్యూమ్ టాయ్‌లెట్స్, సెన్సార్‌తో పనిచేసే నల్లాలు, ఫుట్‌రెస్ట్‌లు వంటి ఆధునిక సదుపాయాలున్న సంగతి తెలిసిందే.