PERNI NANI: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి……వైకాపాపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే పేర్నినాని మండిపడ్డారు. ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే ట్యాపింగ్ అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని పేర్నినాని ధ్వజమెత్తారు.
అసలు జరిగిన విషయం ఏమిటంటే….కోటంరెడ్డి ఫోన్ టాపింగ్ కాదు జస్ట్ ఫోన్ కాల్ రికార్డింగ్ జరిగిందని పేర్ని నాని అన్నారు. ఫోన్ కాల్ రికార్డింగ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు. రికార్డింగ్ కు ట్యాపింగ్ కు తేడా లేదా అని ప్రశ్నించారు.
అయినా మా పార్టీ ఎమ్మెల్యేలపై మేమే నిఘా ఎందుకు పెడతామని పేర్ని నాని ప్రశ్నించారు. ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం మాకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారాలంటే మారొచ్చు అంతేగానీ ఇలా బహిరంగంగా దుమారం సృష్టించడం దేనికని దుయ్యబట్టారు. మారడానికి అన్ని ప్రణాళికలు వేసుకుని…..ఇప్పుడు హడావుడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.
కోటంరెడ్డి, లోకేశ్ ఎప్పటినుంచో మాట్లాడుకుంటున్నారని చెప్పారు. పార్టీలో ఉంటూనే…… మరో పార్టీవైపు చూడటం సరికాదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ కు కోటంరెడ్డి ద్రోహం చేశారంటూ విమర్శించారు. ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఏమవుతుందని ప్రశ్నించారు. ఆయన తప్పు చేస్తే భయపడాలి….తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.