SHOOTING: పల్నాడు జిల్లాలో కాల్పులు కలకలం రేగింది. రొంపిచర్ల మండలం అలవాలలో తెదేపా మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై అర్ధరాత్రి కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. 2 రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ సంఘటనలో బాలకోటిరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆస్పత్రికి తరలించారు.
తెదేపాలో అంతర్గత కుమ్ములాటే….ప్రమాదానికి కారణమా? లేక ఇంకేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడా బాలకోటిరెడ్డిపై దాడి జరిగింది. అయితే దర్యాప్తు జరుగుతుండగానే దాడి తానే చేశానంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు పమ్మి వెంకటరెడ్డి. పార్టీలో గొడవలున్నాయని…..పార్టీ కోసం డబ్బులు ఖర్చు పెడుతుంటే…..బాలకోటిరెడ్డికి ప్రాధాన్యం ఇస్తున్నారని వాపోయాడు.
అయితే తాజా ఘటన కూడా విభేదాల కారణంగానే జరిగిందా అనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.