Politics పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే లక్ష్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాది తోఫా పథకాలు ఆర్థిక సాయం తాజాగా పేద కుటుంబాలకు అందించారు జగన్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు విషయాలు చెప్పుకొచ్చారు..
ఆంధ్రా లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కల్యాణమస్తు కార్యక్రమం చేపట్టింది. అలాగే వైయస్సార్ షాది తోఫా పథకం సైతం చేపట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 4536 మందికి 38. 18 కోట్ల ఆర్థిక సాయం అందించారు. అలాగే ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ.. “అక్టోబరు డిసెంబర్ మధ్య పెళ్లిళ్లు చేసుకున్నవారికి దరఖాస్తు చేసుకోవడానికి ఒక నెల పాటు సమయం ఇచ్చాము. ఫిబ్రవరిలో వెరిఫికేషన్ పూర్తిచేసి ఈరోజు నేరుగా వారికి నగదు జమచేస్తున్నాము. సమాజంలో మార్పు తీసుకువచ్చే దిశగా పథకం అమలుచేస్తున్నాము. ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం పేద ప్రజలకు పేద ఆడబిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అలాగే ప్రతి సంవత్సరంలో ప్రతీ త్రైమాసికానికి సంబంధించి ఇదే పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాము. గొప్ప చదువులతోనే పేదల రాతలు మారుతాయి. ఖర్చుకు వెనుకాడకుండా నిధులు ఖర్చు చేస్తున్నాము. పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడానికి మా ప్రాధాన్యత.. అందుకే ఆడపిల్లలు చదువుకొని పైకి రావాలి ముఖ్యంగా ఆడపిల్ల చదువు ఇంటికి వెలుగు చదువుకొని మంచి స్థాయికి వస్తే కుటుంబ పరిస్థితులు మారుతాయి అందుకే ఎప్పటికీ ప్రభుత్వ ప్రాధాన్యత ఆడపిల్లల చదువులకే.. ” చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి..