Politics తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పేరును పదే పదే ప్రస్తావించారు. డైట్ చార్జీలపై ఈటల సూచనలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావుకు చెప్పటం చర్చనీయంగా మారింది. అయితే ఈ విషయంపై స్పందించారు రాజేందర్..
కెసిఆర్ తన పేరును అసెంబ్లీలో పదే పదే ప్రస్తావించటం తనను డామేజ్ చేసే వ్యూహమే అంటూ చెప్పుకొచ్చారు ఈటల రాజేందర్. నేను కేసీఆర్ మాటలకు పడిపోయే మనిషిని కాదని ఇప్పటికే రకరకాల పద్ధతుల్లో మమ్మల్ని కెసిఆర్ హేళన చేశారని చెప్పకు వచ్చారు పలకరించుకుంటేనే పక్కపక్కన కూర్చుంటేను పార్టీలు మారిపోయే వ్యక్తిని కాదంటూ తెలిపారు..
తాజాగా బడ్జెట్ సమావేశాలు అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. పార్టీలు మారే కల్చర్ ఉన్న వ్యక్తిని తాను కాదంటూ చెప్పుకొచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీని తాను వీడి వచ్చేయలేదని వాళ్లే బయటకు పంపించేసారని చెప్పుకొచ్చారు. తనపై ఆ పార్టీ వాళ్ళు చేసిన దాడి పెట్టిన ఇబ్బంది ప్రజలు మర్చిపోలేదని మళ్లీ పిలిచినా ఆ పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదంటూ చెప్పకు వచ్చారు.. అలాగే భట్టి, అక్బరుద్దీన్ ఒవైసీ, జగ్గారెడ్డి పేర్లను కూడా అలానే పిలుస్తారని తెలిపారు.. అలాగే తెలంగాణలో ప్రజలు అమాయకంగా లేరని ముఖ్యమంత్రి మంత్రులు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదని తెలిపారు అలాగే తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని ముందుగా పట్టించుకోవాలని ఆ తర్వాత ఇలాంటి విషయాలపై ఏకాగ్రత పెట్టాలని చెప్పుకొచ్చారు..