Politics నిర్మాత నటుడు బండ్ల గణేష్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పొగడ్తలతో చెప్పారు కెసిఆర్ లాంటి ముఖ్యమంత్రి సేవలు దేశానికి ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు..
బండ్ల గణేష్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నో పొగడ్తలతో ముంచెత్తారు యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆలయం చూసిన తర్వాత ఈ రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని కూడా అద్భుతమైన ప్రగతిపథం వైపు నడిపించే సత్తా, సామర్థ్యం కేసీఆర్‌కు ఉన్నాయని పూర్తిగా నమ్ముతున్నాను.. కెసిఆర్ మీరు అద్భుతం ఎవరే వండర్ఫుల్ యువర్ ఫీచర్ ఆఫ్ ఇండియా లవ్ యు కేసీఆర్ అంటూ చెప్పుకోవచ్చారు.. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది..
మంగళవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అన్నతరం బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేశారు..
ఎన్నో రోజుల నుంచి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాలని కోరిక ఉన్నా.. ఆ స్వామివారి అనుగ్రహం లేక నాకు రావటం కుదరలేదు. కానీ ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా వచ్చి ఆ యాదగిరి నరసింహ స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ ఆలయాన్ని భూతల స్వర్గంగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి కేసీఆర్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున నా హృదయపూర్వక కతజ్ఞతలు. తెలంగాణ అద్భుతమైన ప్రగతి పథం వైపు దూసుకుపోతుంది అని చెప్పటానికి ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ అభివృద్ధి ఓ నిదర్శనం. కేసీఆర్ ఆలోచన, ఆచరణ ఇవే కాకుండా వాటిని నిర్మిస్తున్న ప్రాజెక్టులు గాని ఆయన ఆలోచన విధానంగానీ మహా అద్భుతంగా తృప్తి చెందాను. చాలా సంతోషం అనిపించింది.. ముఖ్యమంత్రి గారు మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయలేకుండా ఉండలేక పోతున్నాను.. కెసిఆర్ నిజంగా మీరు ఒక అద్భుతమైన వ్యక్తి దేశానికి మీలాంటి నాయకులు ఎంతో అవసరం అంటూ చెప్పుకొచ్చారు..