బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా భవిష్యత్తును కాపాడాలి అంటే బీసీసీఐ ఎంఎస్ ధోనీని రంగంలోకి దింపాలన్నాడు.
‘తక్షణమే కొత్త సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేసి చీఫ్ సెలక్టర్గా ధోనీని నియమించాలి. కానీ బీసీసీఐ ధోనీని సంప్రదించకపోవచ్చు. ఎందుకంటే ధోనీ తన పనిలో జోక్యం చేసుకోవద్దని సూటిగా చెప్పేస్తాడు’ అని అభిప్రాయపడ్డాడు.