SHARMILA: వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అడ్డుపడింది. మహబూబాబాద్ లో పాదయాత్రకు అడ్డుకట్టపడింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైతెపా అధ్యక్షురాలు వ్యాఖ్యలు చేయడంతో …..ఎమ్మెల్యే అనుచరులు ఆమెపై ఫిర్యాదు చేశారు. పాదయాత్ర చేస్తున్న షర్మిలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
గతంలో వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు కూడా నర్సంపేట ఎఅరెస్టుమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల ఘాటుగా మాట్లాడారు. ఆయనను పరుష పదజాలంతో దూషించారు. దాంతో ఆమె యాత్రను పార్టీ కార్యకర్తలు, ప్రజలు అడ్డుకున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే షర్మిలను చేసి హైదరాబాద్ కు తరలించారు.
ఆందోళన తలెత్తడంతో మహబూబాబాద్ పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం షర్మిలను పీఎస్ కు తరలించారు. దీంతో ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వెంటనే షర్మిల పాదయాత్ర అనుమతిని పోలీసులు రద్దుచేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారనే ఆమెను అరెస్టు చేసినట్లు తెలిపారు.