KCR TWEET: ప్రజల దృష్టి మరల్చేందుకే మనీష్ సిసోడియాను అరెస్టు చేశారని…….ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇది వేధింపులు తప్ప మరోకటి కాదని మండిపడ్డారు. అయితే దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. దీన్ని ఖండిస్తూ….భారాస అధినేత కేసీఆర్ ట్వీట్ చేశారు.
దిల్లీ మద్యం లిక్కర్ కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం దిల్లీ కోర్టు సీబీఐ కస్టడీకి ఇచ్చింది. సిసోడియా వచ్చేనెల 4 వరకు సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. దాదాపు 8 గంటలపాటు సీబీఐ విచారణ జరిపింది. ఆ తర్వాత సిసోడియాను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ ప్రకటించింది.
దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సిసోడియాను సీబీఐ హాజరుపరిచింది. అయితే సిసోడియాను 5రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టును విజ్ఞప్తి చేశారు.
అయితే ఎందుకు సిసోడియాను రిమాండ్ కు అడుగుతున్నారని కోర్టు ప్రశ్నించగా….. ఇంకా వివరాలు రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశారు. చివరకు సిసోడియా అరెస్టుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యంపై దాడేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా తీరుపై పినరయి ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలను భయపెట్టేందుకే నిఘా సంస్థలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్ర భాజపా అధికార దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. దేశ ప్రజలంతా ఐక్యమై…..కేంద్రం తీరును ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు