Home / ANDHRAPRADESH / SUMMIT: రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యం

SUMMIT: రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యం

SUMMIT: రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రపంచానికి తెలియజేయడమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని మంత్రి అమర్ నాథ్ అన్నారు. దేశంలోనే పెద్ద సముద్రతీరం గల రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ, అగ్రికల్చర్, వైద్యం, టూరిజం సహా పలు రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తామని మంత్రి తెలిపారు.

14 రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి MOU లు జరుగుతాయని….2 రోజుల పాటు MOU లు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. మార్చి 3న గ్లోబల్ సమ్మిట్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. 25 దేశాలకు చెందిన ప్రతినిధులు సమ్మిట్ కు వస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 14 సెక్టార్లను ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు.

ఈ గ్లోబల్ సమ్మిట్ లో పరిశ్రమలకు చెందిన ఎగ్జిబిషన్ ఉంటుందని మంత్రి తెలిపారు. కొత్త ఇండస్రీయల్ పాలసీని అమలులోకి తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు. పోర్టుల అభివృద్ధికి రాష్ట్రంలో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో తొలిసారి గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోందని వెల్లడించారు. దేశంలో 8 శాతం ఎగుమతులు ఏపీ నుంచే జరుగుతున్నాయని తెలిపారు. దేశంలోని 11 ఇండస్ట్రీయల్ కారిడార్లు 3 ఏపీలోనే ఉన్నాయని వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో కొబ్బరి ఎగుమతుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని మంత్రి అమర్ నాథ్ ప్రస్తావించారు. టెక్స్ టైల్ రంగంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. ఏపీ మారిటం బోర్డ్ ద్వారా 15 వేల కోట్లతో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రతి పోర్టుకు అనుబంధంగా పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino