ఫోర్జరీ కేసులో తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించిందా?
ayyanna: అవును ఫోర్జరీ కేసులో తెదేపా నేత అయ్యన్నపాత్రుడికి అత్యున్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బతగిలింది. దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
గతంలో ఇరిగేషన్ స్థలం కబ్జా చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కేసులో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ పై కేసు నమోదైంది. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై 2 సెంట్ల మేర స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి ప్రహరీ నిర్మించారని పోలీసు కేసు నమోదైంది. అయితే ఈ ఫోర్జరీ కేసు పైన దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ సిటీ రవికుమార్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 467 కింద దర్యాప్తు చేయవచ్చని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టిపారేసింది.
నర్సీపట్నంలోని ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. జలవనరుల శాఖకు చెందిన ఆ పంట కాలువను ఆక్రమించినట్లు సర్వేలో తేలింది. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. అది అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో ఎన్ వోసీను సృష్టించారు. దీనిపై సీఐడీకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీనిని పరిశీలించిన ఈఈ…..ఎన్ వోసీలో ఉన్నది తన సంతకం కాదని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.