Politics తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు అందరినీ ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దటమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ గురుకుల పాఠశాల పై పల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం తో పోటీపడేలా గురుకులంలో ఉండే విద్యార్థులను తీర్చిదిద్దటమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు..
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తాజాగా సిరిసిల్ల జిల్లాలో మైనార్టీ సంక్షేమ శాఖ బిల్డింగ్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కులం మతం ఏదైనా గురుకులాల ద్వారా మంచి శిక్షణ అందించడమే తమ లక్ష్యం అని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదల పిల్లలను ప్రపంచంతో పోటీ పడేలాగా తీర్చిదిద్దుదామని సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వేయికి పైగా గురుకులాలు ఓపెన్ చేసామని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా విద్య పైన 6 వేల కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తున్నట్టు చెప్పుకొచ్చిన మంత్రి కేటీఆర్ మైనార్టీ విద్యార్థుల కోసం 2004 గురుకులం ఏర్పాటు చేశామని అన్నారు గురుకుల పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ఖర్చును తమ ప్రభుత్వం భరిస్తుందని అన్నారు..అలాగే తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కుల మతాలకతీతంగా పనిచేశారని గుర్తు చేశారు. ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ విద్యార్థుల కోసం ఎంతో చేసిందని మునుముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనుందని చెప్పుకొచ్చారు విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ తెలిపారు.