Politics ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ పై తాడేపల్లిగూడెంలో తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అయితే ఏడాది మార్చి 15న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ముఖ్యమంత్రి ప్రారంభించనుండగా ఈ మేరకు సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అనంతరం వర్చువల్ గా ఫేజ్ 3 మిగిలిన వారికి వైయస్సార్ కంటి వెలుగును ప్రారంభించారు.. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35,41,151మంది అవ్వాతాతలకు పరీక్షలు నిర్వహించనున్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 376 టీమ్స్ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ మార్చి 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పూర్తిగా అమలులోకి రానుందని తెలిపారు అదే విధంగా విలేజ్ క్లినిక్ వద్ద ఈ సేవలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేయనున్నారని చెప్పుకొచ్చారు.. ఫ్యామిలీ డాక్టర్ పైలట్ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు అందించనున్నారని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సర్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా 1,149 పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియమాకాలను పూర్తిచేశామన్న అధికారులు చెప్పుకొచ్చారు..
అలాగే ఫేజ్ 3లో భాగంగా అవ్వా తాతలకు కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే 60 సంవత్సరాలు దాటిన 24,65,300 మందికి ఇప్పటికే స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.
వీరిలో సుమారు 8 లక్షల మందికి పైగా కళ్లద్దాలు అందించారు. మరో 4,70,034 మందికి కంటి శుక్లం శస్త్రచికిత్సలు నిర్వహించామని తెలిపిన అధికారులు… ఈ నేపధ్యంలో మూడో విడతలో మిగిలిన వారికి వైఎస్‌ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.