తన బాయ్ ఫ్రెండ్ చిత్రహింసలకు గురిచేశాడని తమిళ నటి అనిఖా విక్రమన్ వెల్లడించారు. శరీరమంతా గాయాలు ఉన్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేశారు. ‘నేను గతంలో అనూప్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నాను.
అతడు నన్ను దారుణంగా హింసించాడు. మొదటిసారి కొట్టినప్పుడు కాళ్ల మీద పడి క్షమాపణ అడగడంతో వదిలేశా. మళ్లీ అదే సీన్ రిపీటయ్యింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాను. వారికి డబ్బులిచ్చి అతను మేనేజ్ చేశాడు’ అని పేర్కొన్నారు.