Ysrcp Party రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలందరికీ ఎంతగానో చేయూతనందిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ పథకాలను ఉపయోగించుకొని తమకు తమ కుటుంబానికి ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటున్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ తగినన్ని వనరులు లేని పేదవారు జగనన్న పథకాలను ఉపయోగించుకొని లబ్ధి పొంది అభివృద్ధి చెందుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో సహకార సంఘాలకు కేవలం రెండూ లేదా మూడు లక్షల రూపాయలు రుణం మాత్రమే లభించగా నేడు దాదాపు 20 లక్షల దాకా రుణం పొందేటటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కల్పించారు. ముఖ్యంగా చేయూత పథకం అనేది మహిళల పాలిట వరంగా మారిందని చెప్పవచ్చు. గతంలో బ్యాంకు నుంచి రుణం పొందిన తర్వాత విడతల వారిగా తీర్చేటప్పుడు మహిళలు కాస్త ఇబ్బంది పడేవారు కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి చేయూత పథకంతో 99% కచ్చితంగా నిన్నటి సమయంలోపు రుణం వాయిదా చెల్లిస్తున్నారు.
బ్యాంకుల నుండి పెద్ద ఎత్తున రుణం లభిస్తున్నందున ప్రజలు వాటిని సక్రమంగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రజలకు నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ యు డి ఎస్ టి ద్వారా శిక్షణ కార్యక్రమాలను ఇస్తోంది. పట్టణ నగర సహకార సంఘాలు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాలు కూడా 10 లక్షల దాకా ప్రస్తుతం ఋణాన్ని పొందుతున్నారు. ఈ విధంగా ప్రభుత్వం రుణ సహాయం అందించడమే కాకుండా వాటిపై అవగాహన కోసం శిక్షణ కార్యక్రమాలు కూడా ఇవ్వడంతో ప్రజలందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.