CM YS JAGAN : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర చరిత్ర లోనే మొట్టమొదటిసారి పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలను సవరించి హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. సివిల్, ఏఆర్, ఏపీఎస్సీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతో పాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్ ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం …
Read More »ఇది కుప్పమా? పులివెందులా?: మంత్రి రోజా
ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలు సీఎం జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. ‘వైఎస్ఆర్ చేయూత’ నిధులు విడుదల కార్యక్రమంలో కుప్పంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జగన్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా నిధులను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, నారా లోకేశ్ కుప్పంలో వీధివీధి తిరిగినా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపిని ప్రజలు ఓడించారని …
Read More »చేయలేకపోతే చెప్పండి.. కొత్తవాళ్లకు అవకాశమిస్తా: జగన్
వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ సమావేశమయ్యారు. ఇచ్చిన పదవికి న్యాయం చేయాలని.. చేసే పని కష్టమనిపిస్తే చెప్పాలని కోరారు. అలా ఎవరైనా చెబితే వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పిస్తానన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నాణ్యతతో చేయాలని ఆదేశించారు. అక్టోబరు 2 లోపు గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి …
Read More »త్వరలో సీఎం జగన్ ‘ప్రజాదర్బార్’
త్వరలో ప్రజా సమస్యలపై నేరుగా ప్రజల నుంచే వినతిపత్రాలను స్వీకరించేందుకు ఏపీ సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. తన క్యాంపు కార్యాలయం వద్ద ‘ప్రజాదర్బార్’ పేరిట వీటిని స్వీకరించి సమస్య పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం 10 గంటలోపు ఈ ప్రజాదర్బార్‌ను పూర్తిచేసే అవకాశముంది. మధ్యాహ్న సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఆయన అపాయింట్మెంట్ ఇవ్వనున్నారు. శని, …
Read More »అవే నాకు శాశ్వత అనుబంధాలు: జగన్ ట్వీట్
రెండు రోజులపాటు నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సూపర్ సక్సెస్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది వైసీపీ కార్యకర్తలు, నేతలు దీనికి హాజరై విజయవంతం చేశారు. నేతల ఉత్సాహపరిచే స్పీచ్‌లతో ప్లీనరీ ప్రాంగణం హోరెత్తిపోయింది. ప్లీనరీ విజయవంతమైన నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ కార్యకర్తలకు మరోసారి సెల్యూట్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘నిరంతరం దేవుని దయ, నడిపించే నాన్న, ఆశీర్వదించే అమ్మ, ప్రేమించే కోట్ల …
Read More »ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు..!
ఏపీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులు నిర్వహించిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడిన పలువురు నేతలు మూడు రాజధానుల బిల్లు తీసుకొస్తామని చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ జరగాలని.. అభివృద్ధి అన్ని ప్రాంతాలకూ విస్తరించాలని ఆకాంక్షించారు. ‘పరిపాలన వికేంద్రీకరణ’పై ప్రవేశపెట్టిన తీర్మానంపై నేతలు మాట్లాడారు. రాష్ట్రం బాగుండాలంటే మూడు రాజధానులు ఉండాలని.. మూడు ప్రాంతాలూ అభివృద్ధి చెందాలని ఎంపీ నందిగం …
Read More »దేవుడు స్క్రిప్ట్ గొప్పగా రాస్తాడు: ప్లీనరీలో జగన్
అప్పట్లో తనపై శక్తివంతమైన వ్యవస్థలతో కాంగ్రెస్, టీడీపీ దాడి చేశాయని వైసీపీ అధినేత, సీఎం జగన్ అన్నారు. ఓదార్పు యాత్ర మానుకోవాలని ఒత్తిడి చేశాయని చెప్పారు. వైసీపీ ప్లీనరీ ముగింపు సందర్భంగా కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. మనకి అన్యాయం చేసిన పార్టీలకు రాష్ట్రంలో నామరూపాల్లేవన్నారు. 2014లో ఓడినా తనపై కుట్రలు, కుతంత్రాలు ఆపలేదని.. 23 మంది ఎమ్మెల్యేలు, 3 మంది ఎమ్మెల్యేలను కొన్నారని చెప్పారు. దేవుడు స్క్రిప్ట్ …
Read More »వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా జగన్..
వైసీపీ జీవితకాల అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నికయ్యారు. వైసీపీ ప్లీనరీలో ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు తనపై కార్యకర్తలు, అభిమానులు ఆప్యాయత చూపించి అనురాగం పంచుతున్నారని చెప్పారు. ఈ ప్లీనరీ ఆత్మీయుల సునామీలా కనిపిస్తోందన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ విధానాలు, బాధ్యతలను ఎంతో అభిమానంతో భుజస్కందాలపై మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు నిండు మను సెల్యూట్ చేస్తున్నట్లు …
Read More »మరోసారి మంచి మనసు చాటుకున్న సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ తనలో ఉన్న మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. తిరుపతి జిల్లాలో వకులామాత ఆలయ సంప్రోక్షణ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. పర్యటన ముగించుకుని తిరిగి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న సమయంలో రోడ్డుపై అర్జీతో నిలుచుకున్న యువకుడు మహేశ్‌ని చూసి కాన్వాయ్ ఆపారు. సెక్యూరిటీ స్టాఫ్‌ని ఆ యువకుడి వద్దకు పంపి అర్జీని తీసుకున్నారు. మహేష్‌కి 2019లో యాక్సిడెంట్ కావడంతో ఎడమ చేయి విరిగిపోయింది. అంగవైకల్యం కలగడంతో …
Read More »ఆ భూముల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి: జగన్ ఆదేశం
పరిశ్రమల కోసం ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎంఎస్ఎంఈలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని.. సకాలంలో వారికి ప్రోత్సాహకాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అభివృద్ధి, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడారు. దేశంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు …
Read More »