Home / BHAKTHI / భారత్‌లో రేపట్నుంచి రంజాన్‌ ఉపవాసాలు

భారత్‌లో రేపట్నుంచి రంజాన్‌ ఉపవాసాలు

భారత్‌లో బుధవారం సాయంత్రం నెలవంక కనిపించకపోవడంతో రంజాన్‌ నెల ఉపవాసాలు శుక్రవారం ఉదయం నుంచి మొదలుకానున్నాయి. దిల్లీలోని బహదూర్‌షా జఫర్‌ మార్గ్‌లో జరిగిన రుయత్‌ ఏ హిలాల్‌, ఇమారత్‌ ఏ షరియా-హింద్‌ కమిటీల సమావేశంలో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. దేశ రాజధాని దిల్లీలో కానీ, మరే ప్రాంతంలో కానీ భారత్‌లో బుధవారం రాత్రి నెలవంక కనిపించలేదని జమియత్‌ ఉలేమా ఏ హింద్‌ ప్రకటించింది.

కాగా, ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేసియాలో నెలవంక కనిపించినట్లు ప్రకటించగానే బుధవారం సాయంత్రం ప్రార్థనలు మొదలయ్యాయి. సౌదీ అరేబియాతోపాటు పలు మధ్య ప్రాచ్య దేశాల్లోనూ బుధవారం రాత్రితో రంజాన్‌ నెల మొదలైనట్లుగా అధికారులు ప్రకటించారు.

ఈ దేశాల్లో గురువారం నుంచి ఉపవాసాలు ఉంటాయి. చాంద్రమాన క్యాలెండర్‌ను అనుసరించే ఇస్లాం సంప్రదాయం ప్రకారం.. నెలవంక కనిపించగానే ఏటా రంజాన్‌ నెల ప్రారంభమవుతుంది. ఒక్కోసారి ఇది కొన్ని దేశాల్లో ఒకరోజు వెనుకాముందుగా ఉంటుంది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat