Home / INTERNATIONAL / దక్షిణాఫ్రికాలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

దక్షిణాఫ్రికాలో ఘనంగా ఉగాది ఉత్సవాలు

దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్ నగరంలో ప్రవాసాంధ్రులు ప్రతీ ఏటా ఘనంగా జరుపుకొనే ఉగాది ఉత్సవాలు ఈసారి కూడా పచ్చదనం వాకిట్లో, తెలుగువెలుగుల జిలుగుల్లో ఆహ్లాదంగా, కన్నులపండువగా జరిగాయి. ఆశ(ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అఫ్ సౌతాఫ్రికా) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు అక్కడి తెలుగువారు భారీగా హాజరయ్యారు.శోభకృత్ ఉగాది వేడుకలు శోభాయమానంగా జరిగాయి. సంప్రదాయ వస్త్రధారణతో వందలాదిగా హాజరైన జనంతో తెలుగుదనం వెల్లివిరిసింది. చిన్నారుల, స్త్రీల ఆటపాటలతో వసంతం విరబూసినట్లయ్యింది.

మరీముఖ్యంగా యువతీయువకులు ప్రదర్శించిన నృత్యరూపకాలు ఆహుతులను ఉర్రూతలూగించాయి. తెలుగు వారికే సొంతమైన ప్రత్యేక వంటకాలు ఈ వేడుకకు మరింత వన్నె తెచ్చాయి.ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన కాన్సులెట్ జనరల్ అఫ్ ఇండియా ప్రసంగిస్తూ ఈ తరానికి మన సంస్కృతీ సంప్రదాయాలను గుర్తుచేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను శక్తి వంచన లేకుండా చేస్తున్న “ఆశ” బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అధ్యక్షుడు రాజు జయప్రకాశ్ మాట్లాడుతూ ఆశ చేస్తున్న బ్రెస్ట్ కాన్సర్ అవే్‌ర్‌నెస్ ప్రోగ్రామ్, కష్టసమయములో ఆంధ్రరాష్ట్ర తుఫాను భాదితులకు ‘ఆశ’ అందించిన సహాయ సహకారాలను, అన్నం పెట్టే పేద రైతు శ్రమ గుర్తించి ‘ఆశ’ అందిస్తున్న చేయూతని వినమ్రంగా వివరించారు.

అనేక సందర్భాల్లో భాదితులకు అండగా నిలబడ్డ క్షణాలని గుర్తుచేసి సభ్యుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.నెలరోజుల ముందునుంచీ నిర్వహించిన క్రీడాపోటీల్లో గెలుపొందిన వారందరికీ బహుమతుల ప్రదానం జరిగింది. దక్షిణాఫ్రికాలోని తెలుగు ప్రజలను కలుపుతూ తెలుగు సంస్కృతిని చాటిచెప్పేందుకు ఆశ చేస్తున్న కృషిని అక్కడివారు అభినందించారు.ఇంతే ఆనందంగా, ఇంతకన్నా గొప్పగా ఇకముందు సేవా కార్యక్రమాలు జరుగుతాయని ఆశ బృందం పేర్కొంది. దేశాలు దాటినా కన్నభూమి కన్నీళ్లను తుడుస్తూ ఎన్నో బ్రతుకుల్లో కొత్త ఆశ పుట్టిస్తున్న “ఆశ” స్ఫూర్తిని పలువురు వక్తలు మనః పూర్తిగా మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమం లో అధ్యక్షుడు, చైర్మన్ లతో పాటు కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు, శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతం చేశారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat