తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది వరుస విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇండస్ట్రీకి చెందిన అంత్యంత సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ కన్నుమూశారు.
తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లాకు చెందిన కాస్ట్యూమ్ కృష్ణ.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్ బంద్’ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు.
పెళ్లి పందిరి సినిమాను నిర్మించడంతో పాటు అందులో నటించారు. పెళ్లాం చెబితే వినాలి, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి సినిమాల్లో నటించారు.