మాస్ మహారాజ రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ ‘రావణాసుర’ .ఈ సినిమాకు సంబంధించిన థీమ్ సాంగ్ ను ఈరోజు సాయంత్ర 5:04లకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
నిన్న థీమ్ సాంగ్ ప్రోమోను విడుదల చేసిన చిత్ర యూనిట్.. ఈరోజు ఉదయం 10:8లకు పుల్ సాంగ్ రిలీజ్ చేస్తామని తెలిపినప్పటికీ అనివార్య కారణాలతో ఈరోజు సాయంత్ర విడుదల చేస్తున్నట్లు తెలిపింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.