భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన 1558 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగస్టు 01 2023 తేదీ నాటికి గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి పదో తరగతి లేదా మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్‌లైన్‌లో ప్రారంభంకాగా.. జూలై 21వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ , ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ , ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.