ఆస్ట్రేలియాలో 2026లో జరగాల్సిన కామన్‌వెల్త్ క్రీడల ను రద్దు చేశారు. విక్టోరియా రాష్ట్రం ఆ క్రీడలను నిర్వహించేందుకు వెనుకడుగు వేసింది. బడ్జెట్ కారణాల వల్ల కామన్‌వెల్త్ క్రీడల్ని నిర్వహించలేకపోతున్నట్లు చెప్పింది.
దీంతో ఆ గేమ్స్ నిర్వహణపై సందిగ్ధం నెలకొన్నది. క్రీడా పోటీల నిర్వహణకు మరో హోస్ట్ నగరాన్ని గుర్తించలేకపోయినట్లు కామన్‌వెల్త్ గేమ్స్ ఫడరేషన్ పేర్కొన్నది.
క్రీడల ఏర్పాట్ల కోసం చేసిన అంచనా వ్యయం మూడింతలు పెరిగిందని విక్టోరియా ప్రీమియర్ డానియల్ ఆండ్రూస్ తెలిపారు. విక్టోరియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరుత్సాహపరిచినట్లు సీజీఎఫ్ పేర్కొన్నది. దీనికి త్వరలో పరిష్కారాన్ని కనుక్కోనున్నట్లు వెల్లడించింది.