ఏపీలో అటు సొంత పుత్రుడు నారాలోకేష్ పాదయాత్ర పేరుతో ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా…ఇటు దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో ఎన్ని వీరంగాలు వేసినా…మరోవైపు పచ్చ మీడియా ఎన్ని జాకీలు వేసినా..టీడీపీ పరిస్థితి రెండు అడుగులు ముందుకు…నాలుగు అడుగులు వెనక్కి అన్న చందాన మారిపోయింది. దత్తపుత్రుడిని ఎంత రెచ్చగొట్టి ప్రభుత్వంపై బురద జల్లించినా జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేయకపోతుండడంతో పాపం బాబోరికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పీక్స్ కు వెళ్లిందని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారు. అందుకేనేమో ఇప్పటికీ హైదరాబాద్ ను ప్రపంచపటంలో పెట్టా…సైబరాబాద్ కట్టించా.. సెల్ ఫోన్లు కనిపెట్టా…ఆఖరికి కరోనా వ్యాక్సిన్ ని కనిపెట్టిన ఘనత కూడా నాదే అంటూ గొప్పలు చెప్పుకునే బిల్డప్ బాబాయ్ బాబుగారు…మరో ఆణిముత్యం లాంటి డైలాగ్ వదిలారు. అసలు ఏపీ రాజకీయాల్లో మోస్ట్ పాపులర్ కమెడియన్ అంటే జలీల్ ఖాన్ అనే చెప్పాలి…బికాంలో ఫిజిక్స్ అంటూ జలీల్ ఖాన్ చేసిన కామెడీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్…ఒక్క డైలాగ్ తో తెలుగు రాష్ట్రాలలో పాపులర్ అయిన కమెడియన్ కమ్ పొలిటీషియన్ జలీల్ ఖాన్ .
అయితే ఇప్పుడు మన 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు జలీల్ ఖాన్ ను మించి మరో అదిరిపోయే డైలాగ్ వేసారు.. గతంలో విజన్ 2020 అంటూ అరిపోయిన రికార్డులా తెలుగు ప్రజలను చావబాదిన చంద్రబాబు ఇప్పుడు విజన్ – 2047 అంటూ మరోసారి ఏపీ ప్రజల చెవుల్లో పచ్చపూలు పెట్టేందుకు రెడీ అయిపోయారు. తాజాగా విశాఖలో విజన్ – 2047 ను ప్రకటించిన చంద్రబాబు …అదే సభలో ఇంజనీరింగ్ చేయాలంటే…బైపీసీ చదవాలంటూ మతిలేని మాటలు చెప్పారు.. అంతే అక్కడ ఉన్నవాళ్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి…కంప్యూటర్ ను, సెల్ ఫోన్లను కనిపెట్టిన మహామేధావి, సత్యనాదేళ్లకు ట్రైనింగ్ ఇచ్చి అమెరికాకు పంపిన విజనరీ లీడర్ ఇలా బైపీసీతో బీటెక్ చేయచ్చు అని సెలవివ్వడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సెటైర్లు పడుతున్నాయి…ఇప్పటి వరకు బికాంలో ఫిజిక్స్ జలీల్ ఖాన్ పాలిటిక్స్ లో కామెడీ కింగ్ అయితే…ఇప్పుడు బైసీపీతో బీటెక్ డైలాగ్ తో మన బాబోరు తన శిష్యుడు జలీల్ ఖాన్ ను మించిపోయాడని ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది. ఎక్కడైనా గురువును మించిన శిష్యుడు ఉంటారు కానీ…మన సైకిల్ పార్టీ అధినేత చంద్రబాబు గారు మాత్రం సింగిల్ డైలాగ్ తో శిష్యుడుని మించిన గురువు అయ్యారని, జలీల్ ఖాన్ పెద్దన్న మన చంద్రన్న అని సోషల్ మీడియాలో తెగ జోకులు పేలుతున్నాయి..బాబోరా మజాకా..